వరల్డ్‌కప్‌: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌ డ్రా

వరల్డ్‌కప్‌: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌ డ్రా

2018 హాకీ మహిళ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. హోరాహోరీగా జరగిన ఈ మ్యాచ్‌ 25వ నిమిషం వద్ద గోయల్‌ అద్భుతమైన గోల్‌తో భారత్‌కు పాయింట్‌ అందించింది. మొదటి హాఫ్‌ ముగిసేసరికి భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో హాఫ్‌లో దూకుడు పెంచి ఇంగ్లండ్‌.. 54 నిమిషం వద్ద తమ ఖాతా తెరిచింది. ఓస్లే లిల్లీ ఈ గోల్‌ చేసింది. ఆ తర్వాత ఏ జట్లూ గోల్స్‌ చేయకపోవడంతో మ్యాచ్‌ 1-1 స్కోరుతో డ్రాగా ముగిసింది.