బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

హామిల్టన్‌లో న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో ఐదో వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ధోని, షమీ, విజయ్ శంకర్ లు తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్‌ ఒక మార్పు చేసింది. గప్తిల్ స్థానంలో మున్రో వచ్చాడు.

జట్లు:

భారత్‌: 
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, శుభమాన్ గిల్‌, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, భువనేశ్వర్, మొహ్మద్ షమీ, యజువేంద్ర చహల్.

న్యూజిలాండ్‌: 
నికోల్స్, మున్రో, విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్, లాథమ్, నీషమ్, సాన్‌ట్నర్, గ్రాండ్‌హోమ్, ఆస్టల్, హెన్రీ, బౌల్ట్‌.