టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో చివరి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. లైయన్‌ స్థానంలో జంపా, బెహెండార్ఫ్‌ స్థానంలో స్టాన్‌లేక్‌ జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం మూడు మార్పులు చేసింది. విజయ్ శంకర్, చహల్, జాదవ్ తుది జట్టులోకి వచ్చారు. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపదాయంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. 

జట్లు:
 

భారత్‌: 
రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, దినేష్ కార్తీక్‌, కేదార్ జాదవ్, విజయ్‌ శంకర్‌, జడేజా, చహల్, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్ షమి.

ఆస్ట్రేలియా: 
ఆరోన్ ఫించ్‌, అలెక్స్‌ కరే, ఉస్మాన్ ఖవాజా, షాన్‌ మార్ష్‌, హాండ్స్‌కాంబ్‌, స్టాయినిస్‌, మాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, సిడిల్‌, జంపా, స్టాన్‌లేక్‌.