భారత కెప్టెన్ తో పాటు మరో ముగ్గురికి కరోనా ...

భారత  కెప్టెన్ తో పాటు మరో ముగ్గురికి కరోనా ...

కరోనా కారణంగా వాయిదా పడిన ఒలంపిక్స్ కోసం బెంగళూరులో జాతీయ జట్టుకు శిక్షణ శిబిరం కొన్ని రోజుల కింద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అందులో శిక్షణ తీసుకుంటున్న భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎస్‌ఐఐ తెలిపింది. మన్‌ప్రీత్‌తో పాటు, డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్ కూడా వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది. అయితే  కరోనా విరామం తరువాత బెంగళూరులోని ఎస్‌ఐఐ సౌత్ సెంటర్‌లో జరుగుతున్న జాతీయ హాకీ క్యాంప్‌కు తిరిగి వచ్చిన ఆటగాళ్ళు ముందు నిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత నిర్వహించిన కరోనా పరీక్షలో అందరికి కరోనా నెగెటివ్ వచ్చింది. కానీ శిక్షణ ప్రారంభమైన తర్వాత మన్‌ప్రీత్ మరియు సురేందర్ ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో వారికి మళ్ళీ టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాబ్బటి ఆటగాళ్లందరికి కూడా మరోసారి టెస్టులు నిర్వహించగా జస్కరన్ సింగ్, వరుణ్ కు కూడా పాజిటివ్ వచ్చింది. అలాగే మరికొంత మంది ఆటగాళ్ల పరీక్ష ఫలితాలకోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు ఎస్‌ఐఐ తెలిపింది. ఇక తనకు కరోనా రావడం పై కెప్టెన్ మన్‌ప్రీత్ మాట్లాడుతూ...  "నేను ఎస్‌ఐఐ క్యాంపస్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ఈ సమస్యను సకాలంలో గుర్తించడంతో మేము జాగ్రత్త పడ్డాము. నేను బాగానే ఉన్నాను మరియు త్వరలో కోలుకుంటాను" అని తెలిపాడు.