362 పరుగుల ఆధిక్యంలో భారత్

362 పరుగుల ఆధిక్యంలో భారత్

నాటింగ్ హామ్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ మూడో రోజు లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 194  పరుగులు చేసింది. నిన్న నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచిన కెప్టెన్ కోహ్లి, పుజారా ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. బౌలర్ ఎవరైనా బాల్ ని ఆచితూచి ఆడుతూ చెత్తబంతులను బౌండరీకి తరలించారు. ఇవాళ ఉదయం 29 ఓవర్లను ఎదుర్కొన్న కోహ్లి-పుజారా 70 పరుగులు జోడించారు. దీంతో భారత్ 362 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పుజారా 40 పరుగుల దగ్గర ఉన్నపుడు ఇచ్చిన క్యాచ్ ని వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో జారవిడిచాడు. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఆడిన పుజారా 168 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. విరాట్ 96 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 54 పరుగులు చేశాడు.