ధోనీ టాప్ స్కోరర్‌.. ప్రతిసారీ భారత్ ఓటమి

ధోనీ టాప్ స్కోరర్‌.. ప్రతిసారీ భారత్ ఓటమి

టీ20లలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాప్ స్కోరర్‌గా నిలిచిన ప్రతీసారీ భారత్ మ్యాచ్ ఓడిపోతుంది. టీ20లలో ధోనీ 5 మ్యాచ్‌లలో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఈ 5 మ్యాచ్‌లలో భారత్ ఓటమిని ఎదుర్కొంది. దీంతో ధోనీపై చెత్త రికార్డు నమోదైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ధోనీ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఈ మ్యాచ్‌లో భారత్ 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

సిడ్నీ వేదికగా 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 48 (నాటౌట్) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2012లోనే ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. భారత్ 6 వికెట్ల తేడాతో ఓడింది. నాగపూర్ వేదికగా 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులు చేయగా.. భారత్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక కాన్పూర్ వేదికగా 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ (36*) పరుగులు చేయగా.. భారత్‌ 7 వికెట్ల తేడాతో ఓడింది.