బ్రిక్స్‌ కప్: భారత్‌ పరాజయం

బ్రిక్స్‌ కప్: భారత్‌ పరాజయం

జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ భారత అండర్‌–17 మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన లీగ్ చివరి నాలుగో మ్యాచ్‌లో 1–2తో చైనా చేతిలో ఓడిపోయింది. బ్రిక్స్‌ టోర్నీలో ఇంతకుముందే మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. మ్యాచ్ మొదటి భాగం 25వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా వచ్చిన అవకాశాన్ని మనీషా గోల్ గా మలిచింది. 42వ నిమిషంలో గోల్ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో  భారత జట్టు తొలి అర్ధభాగాన్ని 1–0 ఆధిక్యంతో ముగించింది. రెండో భాగం 74వ నిమిషంలో పెనాల్టీ గోల్ ద్వారా 1-1తో చైనా స్కోరును సమం చేసింది. 82వ నిమిషంలో మరో గోల్ చేసి 2-1తో విజయం సాధించింది.