కరోనా సీజన్ 2 ఇండియాలో ఎప్పుడంటే.... 

కరోనా సీజన్ 2 ఇండియాలో ఎప్పుడంటే.... 

కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది.  కరోనా కారణంగా దేశంలో ఇప్పటి వరకు 23,077 కేసులు నమోదయ్యాయి.  ఈ సంఖ్య మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.  లెక్కల ప్రకారం భారత్ లో మే రెండో వారంలో పీక్స్ లోకి వెళ్తుంటే.  ఆ సమయంలో పరిస్థితి ఆందోళన కరంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.  ఇండియాలో పీక్స్ కు వెళ్ళడానికి చాలా సమయం ఉన్నది. అయితే, దీని తరువాత మరోసారి ప్రపంచంలోకి కరోనా 2 వస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ అంచనా వేస్తోంది.  ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన సమయంలో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నది. 

అయితే, ఇది ఇండియాలో జూన్ నెలలో వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.  జూన్ జులై నెలల్లో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి అప్పటి వరకు కరోనా ఉదృతి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.  అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలు జాగ్రత్తగా ఉండాలని, సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని అంటున్నారు. కరోనా వైరస్ కు మందు కనుగొనే వరకు జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిష్టితులు నెలకొన్నాయి.