రెండో టెస్టుకు భారత జట్టు ఇదే

రెండో టెస్టుకు భారత జట్టు ఇదే

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో రేపు ప్రారంభమవనున్న రెండో టెస్ట్‌కు 13 మందితో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ లకు చోటు లభించలేదు. జట్టులో ఒక స్పిన్నర్‌కు మాత్రమే స్థానం దక్కింది. అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా వచ్చాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. భువి, ఉమేశ్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో పేసర్ల మధ్య కూడా పోటీ నెలకొంది. ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లు జట్టులో ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆరో స్థానానికి హనుమ విహారీ రానున్నాడు. రోహిత్ మొదటి టెస్టులో 37, 1 పరుగులు చేసి విఫలమయ్యాడు. గాయం కారణంగా రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ దూరమయ్యారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్‌ పృథ్వీషా కూడా ఇంకా కోలుకోలేదు. 

జట్టు:

మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంజిక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్‌.