సిడ్నీ టెస్టుకు భారత్ జట్టు ఇదే...

సిడ్నీ టెస్టుకు భారత్ జట్టు ఇదే...

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా గురువారం చివరి టెస్ట్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లోను విజ‌యం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అందుకు అనుగుణంగానే చివరి టెస్టుకు జట్టును కూడా ప్రకటించింది. తాజాగా బీసీసీఐ త‌మ అధికార ట్విట్ట‌ర్ ద్వారా 13 మంది ఆటగాళ్ళ జాబితాను విడుద‌ల చేసింది. భారత ఆటగాళ్లు ఫామ్, గాయాలతో ఇబ్బంది పడుతుండడంతో తుది జట్టు ఎంపికపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ.. 13 మందిని ఎంపిక చేసింది.

మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్‌ చోటు దక్కించుకున్నాడు. అగర్వాల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో హనుమ విహారీ మళ్లీ మిడిల్ ఆర్డర్ కు రానున్నాడు. రోహిత్ స్థానంలో విహారీ బ్యాటింగ్ చేయనున్నాడు. ఇషాంత్ శ‌ర్మ‌ని త‌ప్పించి ఉమేష్ యాద‌వ్‌కి ఛాన్స్ ఇచ్చారు. ముగ్గురు పేసర్లు అవసరం కాబట్టి ఉమేష్ జట్టులో ఉన్నాడు. ఇక స్పిన్ విభాగంలో జ‌డేశా, అశ్విన్‌, కుల్‌దీప్ లకు చోటు దక్కగా.. ఒక‌రు మాత్ర‌మే తుది జ‌ట్టులో ఉంటారు. మూడో టెస్టులో బ్యాట్, బంతితో రాణించిన జడేజాకు అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి.