వరల్డ్‌కప్‌లో మనకు ఛాన్స్‌ ఉందా? ద్రవిడ్‌ చెప్పేదిదీ.. 

వరల్డ్‌కప్‌లో మనకు ఛాన్స్‌ ఉందా? ద్రవిడ్‌ చెప్పేదిదీ.. 

రానున్న ప్రపంచకప్‌లో టీమిండియా కూడా ఫేవరెట్టేనని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌..అన్నాడు. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగితే మన జట్టు ఈ మెగా టోర్నీలో ప్రమాదకరమని చెప్పాడు. టోర్నీ ప్రారంభంనాటికి.. టీమిండియా పెర్ఫార్మెన్స్‌ పీక్‌కు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో భారీ స్కోర్లు నమోదవడం ఖాయమన్న ద్రవిడ్‌.. ఇటీవల ఇంగ్లండ్‌-ఎ జట్టుతో అక్కడ ఆడిన అన్ని మ్యాచుల్లో స్కోరు 300 దాటిందని గుర్తు చేశాడు. వైట్‌ కలర్‌ కుకాబుర్రా బాల్స్‌ వినియోగించడంతోపాటు ఫీల్డింగ్‌ నిబంధనల్లో మార్పులు చేసినందున.. భారీ స్కోర్ల కచ్చితంగా నమోదవుతాయన్నాడు ద్రవిడ్‌.