పంజాబ్ సరిహద్దుల్లో పాక్ ఎఫ్-16లు, డ్రోన్

పంజాబ్ సరిహద్దుల్లో పాక్ ఎఫ్-16లు, డ్రోన్

పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను ఆపడం లేదు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు పంజాబ్ సరిహద్దుల్లోని ఖేమ్కరన్ సెక్టార్ లో ఒక పాకిస్థానీ డ్రోన్ ఎగరడాన్ని భారత రాడార్లు గుర్తించాయి. వెంటనే భారత వాయుసేన పంజాబ్ లోని ఒక ఎయిర్ బేస్ నుంచి రెండు సుఖోయ్-30 యుద్ధవిమానాలను పంపింది. ఆ వెంటనే పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కూడా రెండు ఎఫ్-16లను దింపింది. ఇరుదేశాల ఫైటర్ జెట్స్ తమ గగనతల పరిధులను ఉల్లంఘించలేదు. 

పీఏఎఫ్ కు చెందిన ఎఫ్-16ను ఐఏఎఫ్ మిగ్-21 బైసన్ తో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూల్చేసిన నెల రోజులకు ఈ సంఘటన జరగడం గమనార్హం. 

ఆ ఘటన తర్వాత చాలా పాకిస్థానీ డ్రోన్లు భారత సరిహద్దుల్లోకి చొరబడబోతే వాటిని భారత వాయు రక్షణ వ్యవస్థలు కూల్చేయడం జరిగింది.