బంగ్లాదేశ్ కు ఇండియా  రైళ్లు... చైనాకు షాక్... 

బంగ్లాదేశ్ కు ఇండియా  రైళ్లు... చైనాకు షాక్... 

ఇండియా చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  రెండు దేశాల బోర్డర్ లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.  దీంతో ఇండియాకు పొరుగునున్న దేశాలతో సయోధ్య నెలకొల్పేందుకు కృషి చేస్తున్నది.  ఇందులో భాగంగా ఇండియాకు మిత్రదేశమైన  బంగ్లాదేశ్  తో అనేక ఒప్పందాలు చేసుకుంది.  ఈ ఒప్పందాల్లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్  కు 10 అత్యాధునిక బ్రాడ్ గేజ్ లోకోమోటివ్  రైళ్లను అందజేస్తోంది.  ఇండియా, బంగ్లాదేశ్  మధ్య కనెక్టివిటీ పెంచేందుకు ఈ రైళ్లు ఉపయోగపడతాయి.  

2019లో రెండు దేశాలు ఈ విషయంపై సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.   ఈ కనెక్టివిటీ నిర్మాణం కోసం మొత్తం 2.44 మిలియన్ డాలర్ల నిధులు అవసరం అవుతాయి.  ఈ నిధులను ఇండియా భరిస్తోంది.  అయితే, ఈ నిధులను బంగ్లాదేశ్ పదేళ్లలో చెల్లించాలి.  అంతేకాదు, ఐదేళ్లపాటు ఈ నిధులపై మారటోరియం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.