రాంచీ టెస్ట్‌ : టీమిండియా ఘనవిజయం

రాంచీ టెస్ట్‌ : టీమిండియా ఘనవిజయం

రాంచీ టెస్ట్‌ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ లో 202 పరుగులతో సౌతాఫ్రికాపై ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సిరీస్‌ ను క్లీన్ స్వీప్ చేసింది కోహ్లీసేన. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రోటీస్ బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు వరుస క్యూ కట్టారు. 8 వికెట్ల నష్టానికి 132 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి.. రెండు వరుస ఓవర్లలో మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలింగ్‌లో షమీ 3 వికెట్లతో చెలరేగగా ఉమేష్‌ యాదవ్, నదీమ్ 2 వికెట్లతో రాణించారు. జడేజా, అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది. సఫారీలపై టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఎప్పుడూలేని విధంగా 3 - 0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న కోహ్లిసేన తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లు పడగొట్టి ఘనచరితకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ సిరీస్‌లో ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొట్టింది టీమిండియా.