కరోనా కల్లోలం.. ఒకేరోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు

కరోనా కల్లోలం.. ఒకేరోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్‌ కంటే తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితి ఉంది.. ఫస్ట్ వేవ్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదు అయినా.. లక్ష దాటింది లేదు.. కానీ, ఆ రికార్డును బ్రేక్ చేసిన సెకండ్ వేవ్... కొత్త రికార్డులను సృష్టిస్తూ.. లక్షకు పైడా పాజిటివ్ కేసులు నమోదు చేసింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,03,558 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... కరోనాబారినపడి 478 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 52,847 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.. ఇక, మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,89,067కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,16,82,136 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,41,830 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 1,65,101కు పెరిగింది.. మరోవైపు.. వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 7,91,05,163 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు కేంద్రం పేర్కొంది.