దూకుడు చూపుతోన్న కరోనా.. మూడు మైలురాళ్లు దాటేసిన భారత్

దూకుడు చూపుతోన్న కరోనా.. మూడు మైలురాళ్లు దాటేసిన భారత్

కరోనా వైరస్‌ భారత్‌లో రోజురోజుకూ దూకుడు చూపుతూనే ఉంది... కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,909 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 217 మంది మృతి చెందారు.. ఇక, ఇదే సందర్భంలో కరోనా కేసుల్లో భారత్ మూడు మైలురాళ్లను దాటేసింది.. ఒకటి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షలు దాటి.. 2,07,615కు చేరుకోగా... కేవలం ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులే లక్ష క్రాస్ చేసి 1,01,497కు చేరాయి. ఇక, కరోనా నుంచి కోలుకుని లక్షకు పైగానే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 5,815కు పెరిగిపోయింది... కరోనా బారినపడి దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి ఇప్పటి వరకు 1,00,303 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.