పాక్‌ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన భారత్..

పాక్‌ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన భారత్..

భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. పాకిస్థాన్ వాయుసేన కవ్వింపు చర్యలకు దిగగా... తగిన విధంగా గుణపాఠం చెప్పింది భారత వాయుసేన. భారత భూభాగంలోని ప్రవేశించిన పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసింది భారత్. నౌషెర్‌లో ఎఫ్‌ -16 యుద్ధవిమాన్నా కూల్చివేసింది. యుద్ధవిమానం నేలకూలుతుండడంతో ఫ్యారాచూట్ సహాయంతో పాక్ పైలట్ తప్పించుకున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. అయితే, ఎఫ్‌-16 యుద్ధవిమానం శకలాలు పాకిస్థాన్ భూభాగంలోనే పడిపోయినట్టు తెలుస్తోంది.