కష్టాలో భారత్... రహానే ఔట్

కష్టాలో భారత్... రహానే ఔట్

చివరి టెస్ట్ లో భారత బ్యాటింగ్ కష్టాలో పడిపోతుంది. ఈరోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సమయానికే స్టార్ ఆటగాడు పుజారా పెవిలియన్ కు చేరుకోగా ఇప్పుడు భారత కెప్టెన్ అజింక్య రహానే 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దాంతో 144 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది టీం ఇండియా. రహానే పెవిలియన్ కు చేరుకోగా మయాంక్(25) తో కలిసి బాటింగ్ చేయడానికి పంత్ వచ్చాడు. అయితే భారత జట్టు ఆసీస్ కంటే ఇంకా 225 పరుగులు వెనకబడి ఉంది.