అగ్ని 5 విజయవంతం...

అగ్ని 5 విజయవంతం...

భూ ఉపరితలం నుంచి ఉపరితలంపై 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని- 5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత్... అగ్ని- 5ని భారత్ దేశీయంగా అభివృద్ధి చేసింది ... ఈ రోజు ఉదయం 9:48 గంటలకు బెంగాల్ బేలోని డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో లాంచింగ్ పాడ్ నంబర్ 4 నుండి మొబైల్ లాంచర్ సహాయంతో దీనిని ప్రయోగించారు. నిర్దేశించిన దూరాన్ని ఇది చేరుకోవడంతో క్షిపణి పరీక్ష విజయవంతమైందని అధికారులు వెల్లడించారు. క్షిపణి పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో తన లక్ష్యాన్ని తాకిందని.. క్షిపణి యొక్క పనితీరును రాడార్లు, ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించామని డీఆర్‌డీవో తెలిపింది. అగ్ని సిరీస్‌లోని ఇతర క్షిపణుల మాదిరిగా కాకుండా... కొత్త సాంకేతికతలతో అగ్ని- 5ని అత్యుత్తమైనదిగా ప్రకటించారు. అగ్ని -5 యొక్క నావిగేషన్ సిస్టమ్స్ చాలా ఖచ్చితత్వాన్ని కలిగిఉంటుందన్నారు.