ఇండియా కరోనా పరీక్షల్లో మరో రికార్డ్

ఇండియా కరోనా పరీక్షల్లో మరో రికార్డ్

భారత్ లో కరోనా విజృంభిస్తున్నది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59 లక్షల 18 వేలు దాటాయి. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,141 మంది  మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 81,177కాగా ఇప్పటి దాకా కరోనా” కు చికిత్స పొంది  డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 47,56,164కు చేరింది. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,571 కాగా దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,70,116గా ఉంది.

కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి  సంఖ్య 92,290కు చేరింది. ఇక దేశంలో 81.74 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 16.67  శాతంగా ఉంది. అలానే దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.59 శాతానికి తగ్గిన మరణాల రేటు. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో  రికార్డ్ స్థాయిలో గడచిన 24 గంటలలో 14,92,409 “కరోనా” వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా దేశంలో ఇప్పటి వరకు 6,89,28,440   కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్టు అయింది.