రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా విజయం

రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా విజయం

రాజ్‌ కోట్ వన్డేలో టీమిండియా సత్తా చాటింది. బ్యాటింగ్‌లో ధవన్, కోహ్లీ,కెఎల్ రాహుల్ అర్థసెంచరీలతో కదంతొక్కారు. ప్రధానంగా రాహుల్ 52 బాల్స్‌లో 80 పరుగులతో కాక రేపాడు. ఇక 50 ఓవర్లలో 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది భారత్. రెండో టర్మ్ లో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్ర్రేలియా భారీ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. ప్రధానంగా స్మిత్ 98 పరుగులు చేసినా ఆసిస్ పతనాన్ని అడ్డుకోలేకపోయాడు. తర్వాతి బ్యాట్స్‌మెన్ పోరాడినా ఫలితం లేకపోయింది. 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆసిస్ ఆలౌటైంది. వాంఖడే వన్డేలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. దీంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మూడో వన్డే విజేతను నిర్ణయించింది.