భారత్‌లోనే ఫిఫా అండర్-17 ప్రపంచకప్

భారత్‌లోనే ఫిఫా అండర్-17 ప్రపంచకప్

2020 అండర్-17 ఉమెన్స్ ప్రపంచకప్ భారత్ లో జరగనుంది. శుక్రవారం ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఫిఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో అండర్-17 ప్రపంచకప్ నకు భారత్ ఆతిథ్యమివ్వనుందని ప్రకటించారు. అమెరికాలోని మియామీలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో మహిళల ఫుట్‌బాల్ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడనుంది. ఇది భారత్ లో జరిగే రెండవ టోర్నమెంట్. ఇంతకుముందు 2017 అండర్-17 మెన్స్ ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యమిచ్చింది. 2018 ఉరుగ్వేలో జరిగిన అండర్-17 మహిళల ప్రపంచకప్ లో మెక్సికోను స్పెయిన్ ఓడించి టైటిల్ గెలిచింది. ఇక న్యూజిలాండ్, కెనడా జట్లు మూడు, నాలుగో స్థానంలో నిలిచాయి.