వామప్ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్యాట్స్‌మెన్‌

వామప్ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్యాట్స్‌మెన్‌

క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ లు అర్ధ సెంచరీలు చేశారు. నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో.. తొలి రోజు వర్షం కారణంగా రద్దయింది. రెండో రోజు టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (3) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా.. పృథ్వి షాతో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. దూకుడు పెంచిన పృథ్వి షా (66) అవుట్ అయ్యాడు. అనంతరం పుజారాతో జత కలిసిన కోహ్లి పరుగుల వరద పారించారు. ఈ క్రమంలో పుజారా (54), కోహ్లి (64) అర్ధ సెంచరీలు చేసి ఔటయ్యారు. రహానే కూడా హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ (40), విహారీ (53) పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివరకు టీమిండియా 358 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.