నేడు ఉప్పల్‌లో తొలి వన్డే..

నేడు ఉప్పల్‌లో తొలి వన్డే..

క్రికెట్ వరల్డ్ కప్ ముంగిట టీమ్‌ఇండియా తుదిపోరుకు సిద్ధమైంది... స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత టీమ్ సన్నద్ధమైంది. వరుస విజయాలతో వన్డేల్లో జోరుమీదున్న టీమ్‌ఇండియాకు సొంతగడ్డపై మరో ప్రాక్టీస్‌ సిరీస్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. సొంతగడ్డపై ఆసీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు నేడు శ్రీకారం చుడుతూ ఉప్పల్‌ స్టేడియంలో తొలి వన్డేలో తలపడనుంది. టీ-20 సిరీస్ కోల్పయిన టీమిండియా.. వన్డేల్లో సత్తా చాటాలన్న కసితో ఉంది. ఇక వన్డే సిరీస్‌లోనూ జోరు కొనసాగించాలని భావిస్తుంది ఆసీస్ జట్టు. ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియా -ఇండియా మధ్య తొలి వన్డే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఇక రోహిత్‌, ధావన్‌, విరాట్‌, రాహుల్‌/ రాయుడు, కేదార్‌ జాధవ్‌, ధోని విజయ్‌ శంకర్‌, కుల్దీప్‌, షమి, చాహల్‌, బుమ్రాతో టీమిండియా... ఫించ్‌, ఖవాజ, హ్యాండ్స్‌కాంబ్‌, స్టాయ్‌నిస్‌, మ్యాక్స్‌వెల్‌, టర్నర్‌, కేరీ, జంపా, కమిన్స్‌, బెహ్రెండార్ఫ్‌, రిచర్డ్‌సన్‌తో ఆసీస్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారీ భద్రతా ఏర్పాటు చేశారు పోలీసులు. 2300 మంది పోలీసులతో గట్టి భద్రత కట్టిదిట్టం చేశారు. 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, బ్యానర్లు, ల్యాప్‌టాప్‌లు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, బైనాక్యులర్, కాయిన్లు, బ్యాటరీలు, హెల్మెట్స్, బ్యాగ్స్ ను స్టేడియంలోకి అనుమతించేదిలేదని స్పష్టం చేశారు.