బిగ్‌ ఫైట్.. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా..

బిగ్‌ ఫైట్.. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా..

ఆసీస్-టీమిండియా వన్డేసిరీస్‌కు సర్వం సిద్ధమైంది. వాంఖడే వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. శ్రీలంకతో టీ20 గెలిచి ఊపుమీదున్న టీమిండియా సొంత గడ్డపై వన్డే సిరీస్‌ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది.. ఆసిస్ జట్టు సైతం అంతే ధీమాగా ఉంది. భారత్‌ను ఓడించి తీరుతామంటోంది. లంకతో పొట్టి సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. దీంతో టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌పై సందిగ్ధత నెలకొంది. రోహిత్‌, ధావన్‌ ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగితే రాహుల్‌ను పక్కన పెడతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే జట్టు అవసరాలను బట్టి తాను బ్యాటింగ్ ఆర్డరులో మార్పులకు సిద్ధమేనని కోహ్లీ తెలిపాడు. బుమ్రా రాకతో జట్టు బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది..

ఆస్ట్రేలియా టీమ్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నాడు టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ. ఆసీస్‌తో సిరీస్‌ ఈజీ కాదని.. ఆ టీమ్‌లో మంచి ప్లేయర్స్‌ ఉన్నారన్నారు కోహ్లీ. భారత్‌ను ఎదుర్కోవడం ఆసిస్‌కు కూడా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌ రసవత్తరంగా సాగడం ఖాయమన్నాడు రన్‌మెషీన్. ఆసిస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఇవాళ ముంబయిలో జరగనుండగా, రెండోది 17న రాజ్‌కోట్‌లో.. మూడో వన్డే 19న బెంగుళూరులో జరగనుంది.