ఆన్‌లైన్‌లో ఉప్పల్ వన్డే టిక్కెట్లు

ఆన్‌లైన్‌లో ఉప్పల్ వన్డే టిక్కెట్లు

హామిల్టన్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కివీస్ పర్యటను ముగించుకుని స్వదేశం చేరుకుంటుంది. అనంతరం సొంత గడపై ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ పర్యటనలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండు టీ20, ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్‌లు జరగనున్నాయి. మొదటగా ఈనెల 24న విశాఖపట్నంలో తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది.

మార్చి 2న తొలి వన్డే మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఈనెల 11 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈవెంట్స్‌నౌ.కామ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ పేర్కొంది.