9 నెలల తర్వాత తొలి వన్డే సిరీస్.. భారత్-ఆసీస్ ఢీ..
కరోనా వైరస్‌తో క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి... ఐపీఎల్ జరిగినా.. ప్రేక్షకులకు మాత్రం ఎంట్రీ లేదు.. కానీ, 9 నెలల తర్వాత టీమిండియా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతోంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగే తొలి వన్డేలో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు స్టేడియం సామర్థ్యంలో 50 శాతం ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. మళ్లీ అసలు సిసలు క్రికెట్ మజాను ఆస్వాదించబోతున్నారు అభిమానులు. అయితే కరోనా కారణంగా పూర్తిగా కాకుండా... స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇవాళ మ్యాచ్ జరిగే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సీటింగ్ సామర్థ్యం 48 వేలు కాగా... 24 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ఇవాళ మ్యాచ్ జరగనుంది.
ఇక, గత పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లి సేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం కాస్త లోటుగా కనిపిస్తోంది. ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్-మయాంక్ అగర్వాల్ ప్రారంభిస్తారు. మూడోస్థానంలో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్‌కు దిగనున్నారు. ఈ సిరీస్‌లోనూ రాహులే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక బుమ్రా, షమి ఇద్దరూ తుది జట్టులో ఉంటే.. ఠాకూర్, సైనీలలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. అటు స్పిన్నర్లలో చాహల్ లేదా కుల్దీప్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా టీమ్ కూడా వార్నర్, ఫించ్, స్మిత్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, కమిన్స్ వంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమైన స్టీవ్ స్మిత్ మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనుండటం... ఆస్ట్రేలియాకు కలిసివచ్చే అంశం. అక్కడి కాలమానం ప్రకారం తొలి వన్డే డే నైట్‌లో జరిగినా... భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9 గంటల పది నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)