నేటి నుంచే ఉప్పల్ వన్డే టిక్కెట్ల అమ్మకాలు

నేటి నుంచే ఉప్పల్ వన్డే టిక్కెట్ల అమ్మకాలు

సొంత గడపై ఆస్ట్రేలియాతో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఈ నెల 24 నుంచి రెండు టీ20ల సిరీస్, మార్చి 2 నుండి ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెల 2న హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ వన్డే మ్యాచ్‌ టిక్కెట్లను గురువారం ఉదయం 11 గంటల నుంచి సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో విక్రయించనున్నారు. టిక్కెట్ల ధర కనిష్ఠంగా రూ.600 కాగా.. గరిష్ఠంగా రూ.6 వేలుగా ఉంది. అయితే ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.600, రూ.900ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.