విశాఖ టీ20.. టికెట్లకు ఫుల్‌ క్రేజ్‌

విశాఖ టీ20.. టికెట్లకు ఫుల్‌ క్రేజ్‌

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా సిద్ధమైంది. మొదటగా రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆదివారం తొలి సమరం జరగనుంది. విశాఖలోకి పోతుల మల్లయ్య పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగే తొలి టీ20 మ్యాచ్ కు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 1,400 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 4 గంటల తర్వాత స్టేడియంకు వెళ్లే పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే 24 వేల టిక్కెట్లను విక్రయింయించింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియం కెపాసిటీ 27,500 కాగా.. 24 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మ్యాచ్ కు ఇంకా సమయం ఉన్న  నేపథ్యంలో దాదాపు అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ స్టేడియం ఈ రోజు కలకలలాడబోతోంది. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా స్టేడియం మొత్తం జనాలతో కిక్కిరిసిపోతదని ఓ అధికారి తెలిపారు.