మ్యాచ్ అందుకే ఓడిపోయాం: కోహ్లీ

మ్యాచ్ అందుకే ఓడిపోయాం: కోహ్లీ

ఆదివారం విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా భారత పర్యటనకు ఘనంగా ఆరంభించింది. అంతేకాదు వారి సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ... విశాఖ పిచ్ పై తొలి ఇన్నింగ్స్ లో సరిగా ఆడలేకపోయాం. 15వ ఓవర్‌ వరకు పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించలేదు. నిజానికి మేం బ్యాటింగ్‌లో వైఫల్యం చెందాం. టీ20ల్లో తక్కువ స్కోర్ చేసి గెలవలేం. మా బౌలర్ల ప్రదర్శన బాగుంది. బుమ్రా తన బౌలింగ్ తో అద్భుతం చేశాడు. మధ్య ఓవర్లలో మయాంక్‌ కూడా బాగా బౌలింగ్‌ చేశాడని విరాట్ తెలిపారు.

ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా లోకేష్ రాహుల్‌, రిషబ్ పంత్‌లకు అవకాశం ఇచ్చాం. రాహుల్‌ అద్భుతంగా ఆడాడు. ఇద్దరం కలిసి మంచి భాగస్వామ్యం కూడా నెలకొల్పా. ఈ పిచ్‌పై 150 పరుగులు చేసుంటే కచ్చితంగా గెలిచేవాళ్లం. ఆసీస్ ఈ విజయానికి అర్హులు అని కోహ్లీ చెప్పుకొచ్చారు.