బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ఆసీస్ మాత్రం స్పిన్నర్ నాథన్ లియోన్ తుది జట్టులోకి తీసుకుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్.. రెండో వన్డే మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో అయినా సత్తా చాటాలని ఆసీస్ భావిస్తోంది.

జట్లు:

భారత్‌: 
శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదార్‌ జాదవ్, విజయ్‌ శంకర్, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జఫ్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: 
ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), ఉస్మాన్ ఖావాజా, షాన్‌ మార్ష్, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, కూల్టర్‌ నీల్, పాట్ కమిన్స్, నాథన్ లియోన్, ఆడమ్ జంపా.