సిరీస్ చేజార్చుకున్న భారత్..

సిరీస్ చేజార్చుకున్న భారత్..

టీంఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల వరద పారించారు. వారి ధాటికి భారత బౌలర్లు విలవిల్లాడారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్ కావడంతో మరోసారి పరుగుల వరద పారింది. కంగారూలను భారత బౌలర్లు ఏమాత్రం నిలువరించలేకపోయారు. 

390 భారీ లక్ష్యచేధనలో బ్యాటింగ్‌కి దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (89; 87 బంతుల్లో), కేఎల్ రాహుల్ (76; 66 బంతుల్లో) అర్ధశతకాలతో పోరాడిన టార్గెట్‌ను అందుకోలేకపోయింది. ఆ తర్వాత జడేజా(24), పాండ్యా(28) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి వరుస బంతుల్లో ఔటయ్యారు. దాంతో భారత్ పోరాటం ముగిసింది. వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడి, 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు‌) మరోసారి మెరుపు సెంచ‌రీతో రాణించగా.. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు‌), ఆరోన్ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి భారత బౌల‌ర్లు మ‌రోసారి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా (1/79), షమీ (1/73), చహ‌ల్ (0/71), సైనీ (0/70), జ‌డేజా(0/60) దారుణంగా విఫలమయ్యారు. పాండ్యా(1/24) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు.