ధావన్, రాహుల్ అవుట్

ధావన్, రాహుల్ అవుట్

రెండు టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. దూకుడుమీదున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (47) అర్ధ సెంచరీకి చేరువలో అవుట్  అవగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (14) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి రెండు ఓవర్లు  జాగ్రత్తగా ఆడిన రాహుల్.. అనంతరం బౌండరీల వర్షం కురిపిస్తూ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 3 ఫోర్లు, 4 సిక్సుతో 47 పరుగులు చేసాడు. ఆసీస్ పేసర్ కౌంటర్‌నైల్ వేసిన  8వ ఓవర్ తొలి బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రిచర్డ్‌సన్‌కి దొరికిపోయాడు. ఇక 10వ ఓవర్ రెండో బంతికి ధావన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 10  ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (7), రిషబ్ పంత్ (1)లు ఉన్నారు.