సిరీస్‌ విజయంపై టీమిండియా గురి

సిరీస్‌ విజయంపై టీమిండియా గురి

ఆసీస్‌ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్‌.. వన్డే సిరీస్‌ను విక్టరీలతో స్టార్ట్‌ చేసింది. తొలి రెండు వన్డేల్లోనూ గెలుపొందిన టీమిండియా ఇవాళ మూడో మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడబొతోంది. రాంఛీలో జేఎస్‌సీఏ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ చేజారనివ్వకూడదన్న లక్ష్యంగా కంగారూలు బరిలోకి దిగనున్నారు.

ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మల పేలవ ఫామ్‌తో జట్టుకు శుభారంభాలు లభించకపోవడంతో కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. ఐతే.. ఈ మ్యాచ్‌తో సిరీస్‌ను ఖాతాలోకి వేసుకున్నాక.. జట్టులో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. కీలకమైన నాలుగో స్థానంలో అంబటి రాయుడు మళ్లీ గాడి తప్పినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంది.  ఇక చివరి మూడు వన్డేలకు పేసర్‌ భువనేశ్వర్‌ జట్టులో చేరాడు.

మరోవైపు.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండడం ఆసీస్‌ను కలవరపెడుతోంది. మధ్య ఓవర్లలో భారత స్పిన్‌ను ఎదుర్కొంటూ స్ట్రయిక్‌ను రొటేట్‌ చేసుకోవడంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ విఫలమవుతున్నారు. టీ20ల్లో రెచ్చిపోయిన మ్యాక్స్‌వెల్‌.. మరోసారి సత్తాచాటితో భారత్‌కు ఇబ్బందే