తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఎట్టకేలకు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అరోన్ ఫించ్ 93 (99 బంతుల్లో ; 10 ఫోర్లు, 3 సిక్సులు) అవుట్ అయ్యాడు. కుల్దీప్ వేసిన 32వ ఓవర్ ఐదో బంతికి ఫించ్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో 193 పరుగుల మొదటి వికెట్ బాగస్వామ్యంకు తెరపడింది. అయితే మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీకి చేరువలో ఉన్నాడు. అతనికి తోడుగా స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ ఉన్నాడు. 34 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 204 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఖవాజా (94), మ్యాక్స్‌వెల్ (9) ఉన్నారు.