బౌలింగ్ ఎంచుకున్న భారత్

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా రాంచిలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పులు చేయలేదు. పేసర్‌ భువనేశ్వర్‌, స్పిన్నర్ చాహాల్ బెంచ్ కే పరిమితమయ్యారు. మరోవైపు ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. కూల్టర్‌ నీల్ స్థానంలో రిచర్డ్సన్ ను తుది జట్టులోకి తీసుకుంది. తొలి రెండు వన్డేలో గెలిచిన భారత్.. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ నిలుపుకోవాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. 

జట్లు:

భారత్‌: 
శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదార్‌ జాదవ్, విజయ్‌ శంకర్, రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జఫ్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: 
ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), ఉస్మాన్ ఖావాజా, షాన్‌ మార్ష్, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, రిచర్డ్సన్, పాట్ కమిన్స్, నాథన్ లియోన్, ఆడమ్ జంపా.