ఆసీస్‌కు షాక్...

ఆసీస్‌కు షాక్...

మొహాలి వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఆసీస్ కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నాలుగో బంతికి ఫించ్ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 3 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా (3), షాన్‌ మార్ష్‌ (6)లు క్రీజులో ఉన్నారు.