ఖవాజా @ 50.. స్కోర్ 114/2

ఖవాజా @ 50.. స్కోర్ 114/2

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (50; 52 బంతుల్లో 5×4) అర్ధశతకం చేసాడు. విజయ్‌ శంకర్‌ వేసిన 17.6వ బంతికి సింగిల్‌ తీసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఖవాజాకు ఇది వన్డేల్లో 7వ అర్ధశతకం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0), షాన్ మార్స్ (6)లు త్వరగానే పెవిలియన్ చేరినా.. ఖవాజా సమయోచితంగా ఆడి ఆసీస్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. ఖవాజాకు పీటర్‌ హాండ్స్‌కాంబ్‌ చక్కటి సహకారం అందిస్తున్నాడు. 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఆసీస్‌ 114 పరుగులు చేసింది. ప్రస్తుతం ఉస్మాన్‌ ఖవాజా (57), పీటర్‌ హాండ్స్‌కాంబ్‌ (44) క్రీజులో ఉన్నారు.