బ్రిస్బేన్ టెస్ట్.. నిలిచిపోయిన భారత్‌ బ్యాటింగ్‌

బ్రిస్బేన్ టెస్ట్.. నిలిచిపోయిన భారత్‌ బ్యాటింగ్‌

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతోన్న నాల్గో టెస్ట్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు... రెండోరోజు తొలి సెషన్‌లో టీమిండియా బౌలర్ల విజృంభణతో 369 పరుగుల దగ్గర తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది ఆసీస్‌ జట్టు.. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించి భారత జట్టు 62 పరుగులు చేసింది.. మొత్తంగా 26 ఓవర్లను ఎదుర్కున్నారు భారత బ్యాట్స్‌మన్స్‌.. శుభ్‌మన్‌ గిల్ 7, రోహిత్‌ శర్మ 44 పరుగులు చేసి ఔట్‌ అయ్యారు.. దీంతో.. 60 పరుగులకే టీమిండియా రెండు కీలకమైన వికెట్లు సమర్పించుకుంది. పుజారా 8, రహానే 2 పరుగులతో క్రీజ్‌లో ఉండగా.. మ్యాచ్‌కు వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో.. మ్యాచ్‌ను నిలిపివేశారు. కాగా.. 274/5 పరుగుల దగ్గర రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు.. ఇవాళ మరో 95 పరుగులో జోడిం 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శార్దూల్ చెరో మూడేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.