ఢిల్లీ వన్డే: కష్టాల్లో టీమిండియా..

ఢిల్లీ వన్డే: కష్టాల్లో టీమిండియా..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది. 273 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత జట్టు 42 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం కేదార్ జాదవ్ (38), భువనేశ్వర్ కుమార్ (30) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసి.. 56 పరుగులకు ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (12)‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (20, రిషబ్‌ పంత్‌ (16), విజయ్‌ శంకర్‌ (16) తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాట పట్టారు. రవీంద్ర జడ్డేజా డకౌట్‌ అయ్యారు. తన బౌలింగ్‌తో టీమిండియాను బెంబేలెత్తించిన ఆడం జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ లియాన్‌, పాట్ కుమ్మిన్స్, స్టోనిస్ ఒక్కో వికెట్‌ సొంతం చేసుకున్నాడు.