ఢిల్లీ వన్డే: టీమిండియా టార్గెట్ 273

ఢిల్లీ వన్డే: టీమిండియా టార్గెట్ 273

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. దీంతో నిర్ణిత 50 ఓవర్లలో ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుక్ను ఆసీస్‌ ఫించ్‌ (27 పరుగులు), ఖవాజా (100), హ్యాండ్స్‌కోంబ్‌ (52) మెరవడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కానీ 30 ఓవర్ల తర్వాత టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కంగారూ జట్టు వేగానికి కళ్లెం వేశారు. 33వ ఓవర్‌లో చక్కని బంతితో భువనేశ్వర్‌ ఖవాజాను ఔట్‌ చేశాడు. రెండు ఓవర్ల తర్వాత జడేజా ఊరిస్తూ వేసిన ఆఫ్‌ స్పిన్‌ బాల్‌కు హిట్టింగ్‌కు వెళ్లి మ్యాక్స్‌వెల్‌ కోహ్లీ చేతికి చిక్కాడు. 37వ ఓవర్‌ రెండో బంతికి ధాటిగా ఆడుత్నున్న హ్యాండ్స్‌కోంబ్‌ను షమీ బోల్తా కొట్టించాడు. స్టొయినిస్‌ను భువీ, అలెక్స్‌ కరేను షమీ ఔట్‌ చేయగా.. 4వ వన్డే హీరో టర్నర్‌ను స్పిన్నర్‌ కుల్దీప్‌ పెవిలియన్‌ పంపాడు.