చమటోడుస్తోన్న ఆసీస్ బ్యాట్స్‌మన్లు

 చమటోడుస్తోన్న ఆసీస్ బ్యాట్స్‌మన్లు

ఐసీసీ ప్రపంచ కప్ లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న మ్యాచ్ లో విజయం కోసం ఆస్ట్రేలియా జట్టు శ్రమిస్తోంది. భారత్ నిర్దేశించిన 353 విజయ లక్ష్యం కోసం ఆసీస్ బ్యాట్స్‌మన్లు చమటోడుస్తున్నారు. 14వ ఓవర్‌లో పాండ్యా వేసిన మొదటి బంతికి ఒక పరుగు తీసిన ఫించ్ (56; 86 బంతుల్లో, 5 ఫోర్లు) రెండో పరుగుకు యత్నించి రన్ అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ (56; 84 బంతుల్లో 5 ఫోర్లు) చెలరేగి ఆడాడు. 25వ ఓవర్ లో చాహాల్ వేసిన బంతికి భువనేశ్వర్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ట నష్టానికి 155 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (42 ; 50బంతుల్లో, 1 ఫోరు), ఉస్మాన్ క్వాజా (10 ; 12బంతుల్లో ) క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ విజయం సాధించాలంటే  ఇంకా 197 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.