ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం

ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా కీలక మ్యాచ్ లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం ఓవల్ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (117; 109 బంతుల్లో 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీనికితోడు విరాట్‌ కోహ్లి (82; 77 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు), రోహిత్‌శర్మ (57; 70 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్), హార్దిక్‌ పాండ్య (48; 27 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా 5 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా గట్టిగానే పోరాడినా.. చివర్లో వికెట్లు కోల్పోయి, సరిగ్గా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (69; 70 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సు), డేవిడ్ వార్నర్( 56; 84 బంతుల్లో, 5 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (42; 39 బంతుల్లో, 4 ఫోర్లు,1 సిక్సు), చివర్లో అలెక్స్ కెరె (55; 35 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సు) పోరాడిన ఫలితం లేకపోయింది. భువనేశ్వర్‌ (3/50) బుమ్రా (3/61), చాహల్‌ (2/62) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. టోర్నీలో టీమిండియాకిది వరుసగా రెండో విజయం. భారత్‌ గురువారం తన తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది.