ఆస్ట్రేలియా టార్గెట్ః 353

ఆస్ట్రేలియా టార్గెట్ః 353

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (117; 109 బంతుల్లో, 16 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మ జట్టుకు సెంచరీ భాగస్వామ్యం అందించారు. రోహిత్ శర్మ (57; 70 బంతుల్లో 3 ఫోర్లు) నైల్ బౌలింగ్ లో వికెట్ కిపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(82; 77 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు) బాధ్యతాయుతంగా ఆడాడు. ఆసీస్ బౌలర్ స్టోనిక్స్ బౌలింగ్ లో పాట్ కమిన్ కు దొరికి పెవిలియన్ చేరాడు. చివర్లో హర్దీక్ పాండ్య(48; 27 బంతుల్లో, 4 ఫోర్లు, ), ధోనీ (27; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. కేఎల్ రాహుల్(11; 3 బంతుల్లో, 1 ఫోరు), కేదార్ జాదవ్ (0) నాటౌట్ గా మిగిలారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోనిక్స్ రెండు వికెట్లు, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నైల్ తలో వికెట్ తీశారు.