టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య కాసేపట్లో కెన్నింగ్టన్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా కంగారుల జోరును కట్టడి చేయాలని చూస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న ఫించ్‌ సేన హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఇక రెండూ జట్లూ బలాబలాల్లో సమానంగా కనిపిస్తున్నాయి.. హోరాహోరీగా పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. ఈ నెల 16న పాకిస్థాన్‌ను ఢీకొనబోతున్న భారత్‌.. ఆస్ట్రేలియాను ఓడించిన ఊపుతో ఆ మ్యాచ్‌కు వెళ్లాలనుకుంటోంది. బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్‌, ధోని.. బౌలింగ్‌లో బుమ్రాపై భారత్‌ ఎన్నో ఆశలతో ఉంది.