ప్రాక్టీస్ సెషన్ లో ధోనికి గాయం..

ప్రాక్టీస్ సెషన్ లో ధోనికి గాయం..

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో శనివారం ఉప్పల్ వేదికగా జరగనున్న తొలివన్డేకు ఆడటం అనుమానంగా మారింది. శుక్రవారం భారత క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌ చేస్తుండగా ధోని ముంజేతికి గాయమైంది. వేగంగా విసిరిన బంతి ధోని కుడిచేతికి బలంగా తగలడంతో ధోని ఎక్కువసేపు ప్రాక్టీస్‌ చేయలేదు. ఈ క్రమంలోనే అతను తొలి వన్డేకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా తుది జట్టును ప్రకటించకపోయినప్పటికీ ధోని ఆడటం అనేది అనుమానంగా మారింది. తొలి వన్డేలో ధోని ఆడతాడా.. లేదా అనే విషయంపై ఈరోజు రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలి వన్డేకు ధోని దూరమైతే.. టీమిండియాకు గట్టి దెబ్బె అని చెప్పవచ్చు. ఇప్పటికే టీ-20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. మొదటి వన్డేలో విజయం సాధించి భోణీ కొట్టాలని భావిస్తుంది. ధోని గాయం టీమ్ మేనేజ్ మెంట్ ను కలవరపరుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైతే.. రిషబ్ పంత తుది జట్టులోకి వస్తాడు.