ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌ షెడ్యూల్ ఖరారు..

ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌ షెడ్యూల్ ఖరారు..

ఈ ఏడాది యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 3 న ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఇందుకోసం తాజాగా బీసీసీఐ జట్లను ప్రకటించింది.  అయితే తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు సంభందించిన షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. వన్డే, టీ-20 సిరీస్ లతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా జరుగనుంది. తొలి వన్డే నవంబర్ 27 న సిడ్నీలో జరుగనుంది. రెండో వన్డే నవంబర్ 29 సిడ్నీలో, మూడో వన్డే డిసెంబర్ 2 న మనుక ఓవెల్ జరుగుతుంది. ఇక తొలి టీ-20 డిసెంబర్ 4 న అదే వేదిక మీద జరుగనుంది. రెండో టీ-20 డిసెంబర్ 6 న, మూడో టీ-20 డిసెంబర్ 8 న సిడ్నీ వేదికగా జరుగనుంది. ఇక టెస్టుల విషయానికి వస్తే..తొలి టెస్ట్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే అండ్ నైట్ గా జరుగనుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరుగనుంది. మూడో టెస్ట్ జనవరి 7 నుంచి 11 వరకు..నాలుగో టెస్ట్ జనవరి 15 నుంచి 19 వరకు జరుగుతుంది.