విశాఖలో టీ20.. 27న కాదు.. 24న..!

విశాఖలో టీ20.. 27న కాదు.. 24న..!

విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 27న జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌ను 24వ తేదీకి మార్చారు. వాస్తవంగా సిరీస్‌ తొలి మ్యాచ్‌ ఈ నెల 24న బెంగళూరులో జరగాలి. కానీ.. తొలి మ్యాచ్‌ను విశాఖకు మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న బెంగళూరులో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షోకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతుండడంతో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను నిర్వహించలేమని బీసీసీఐకి కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఈక్రమంలో అక్కడ జరగాల్సిన తొలి మ్యాచ్‌ను విశాఖకు, 27న విశాఖలో జరిగే రెండో మ్యాచ్‌ను బెంగళూరుకు మార్చాలని బోర్డు నిర్ణయించింది. ఇక.. ఈ సిరీస్‌లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు 5 వన్డేలు, 3  టీ-20లు ఆడనున్నాయి.