వీడియో: రోహిత్‌ను ఇంటర్వ్యూ చేసిన చాహల్‌

వీడియో: రోహిత్‌ను ఇంటర్వ్యూ చేసిన చాహల్‌

టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మను స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ ఇంటర్వ్యూ చేశాడు. శనివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డే అనంతరం రోహిత్‌ను చాహల్‌ ప్రశ్నలు అడిగాడు. చాహల్‌ అడిగిన ప్రశ్నలకు రోహిత్‌ సమాదానాలు ఇచ్చాడు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి రోహిత్‌ను చాహల్‌ ఏం ప్రశ్నలు అడిగాడో తెలియాంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే.

తొలి వన్డేలో 'హిట్‌ మ్యాన్‌' సెంచరీ (129 బంతుల్లో 133 పరుగులు 10 x 4, 6 x 6) చేసినా.. టీమిండియా మ్యాచ్‌ ఓడిపోయింది. అయితే కీలక సమయంలో అద్భుత సెంచరీ చేసిన రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిసింది.