ఐసీసీ ప్రపంచకప్ః ధవన్ సెంచరీ

ఐసీసీ ప్రపంచకప్ః ధవన్ సెంచరీ

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ సెంచరీ నమోదు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోన్న ధవన్(100; 96 బంతుల్లో, 13 ఫోర్లు) శతకంతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ (57; 70 బంతుల్లో 3 ఫోర్లు) నైల్ బౌలింగ్ లో వికెట్ కిపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్, మూడో బంతిని రోహిత్ శర్మ షాట్ ఆడగా స్కేర్ లెగ్‌లో గాల్లో లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కౌల్టర్ నైల్ గాల్లో డైవ్ చేసి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. ఐతే బంతి అతని చేతికి తాకి వెళ్లిపోవడంతో రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, స్టార్క్ కళ్లుచెదిరే బంతులతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయకుండా కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి టీమిండియా 190 పరుగులు సాధించింది. ధవన్(100; 96 బంతుల్లో, 13 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ(28; 32 బంతుల్లో, 2 ఫోర్లు) క్రీజ్ లో ఉన్నారు.